Kelvin: ఈడీ ముందు అప్రూవర్ గా మారి.. టాలీవుడ్ స్టార్ల చిట్టా విప్పిన కెల్విన్?

Kelvin became approver to ED and gives details about Tollywood stars
  • ఆరు నెలల క్రితం డ్రగ్ పెడ్లర్ కెల్విన్ పై ఈడీ కేసు
  • 12 సార్లు విచారించిన ఈడీ అధికారులు
  • విదేశాలకు భారీగా డబ్బు బదిలీ అయినట్టు గుర్తించిన ఈడీ
సరిగ్గా నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులను విచారించింది. ఆ సమయంలో డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ను కూడా ఎక్సైజ్ అధికారులు విచారించారు. అయితే, ఆ సందర్భంగా కెల్విన్ ఎలాంటి సమాచారం వెల్లడించలేదని తెలుస్తోంది. అయితే ఆరు నెలల క్రితం కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈ కేసును నమోదు చేసింది.

అప్పటి నుంచి దాదాపు 12 సార్లు కెల్విన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్ అకౌంట్లను కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ క్రమంలో ఈడీకి కెల్విన్ అప్రూవర్ గా మారాడు. కెల్విన్ అందించిన వివరాల ఆధారంగానే తాజాగా 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక్కడి నుంచి విదేశాలకు డబ్బును భారీగా బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారించిన సమయంలో కూడా నగదు బదిలీ అంశంపైనే ఈడీ ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
Kelvin
Tollywood
Drugs
Enforcement Directorate
Approver

More Telugu News