Telangana: ‘మావో’లతో సంబంధాలు.. ఏపీ హైకోర్టు న్యాయవాది అరెస్ట్!

AP High Court lawyer Prithvi Raj arrested
  • కొత్తగూడెం జిల్లా చర్లలో అదుపులోకి
  • మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వచ్చాడన్న పోలీసులు
  • కోర్టుకు తరలింపు
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విజయవాడకు చెందిన ఏపీ హైకోర్టు న్యాయవాది అంకాల పృథ్వీరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పోలీసులు నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

 పృథ్వీరాజ్‌ను విచారించగా పూసుగుప్ప- చత్తీస్‌గఢ్‌లోని రాంపురం-మల్లంపేట అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేత దామోదర్‌ను కలిసి వస్తున్నట్టుగా వెల్లడైందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన శైలేంద్ర ముఖర్జీ ఆగస్టు 7న చనిపోయాడు. ఆయన ఆశయాలను కొనసాగించాలని ఉన్న కరపత్రాలను ఆయన నుంచి స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Telangana
AP High Court
Lawyer
Prithvi Raj
Arrest

More Telugu News