Nara Lokesh: రాష్ట్రంలో రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే సీఎం సిమ్లాలో ఎంజాయ్ చేసొచ్చారు: నారా లోకేశ్

Nara Lokesh criticizes CM Jagan
  • సిమ్లా పర్యటనకు వెళ్లొచ్చిన సీఎం జగన్
  • విమర్శలు చేసిన లోకేశ్
  • రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని వ్యాఖ్యలు
  • మహిళలకు జీవించే హక్కు లేదా? అంటూ ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం సిమ్లా వెళ్లి రావడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రోజుకో ఆడబిడ్డ బలైపోతుంటే సీఎం సిమ్లాలో ఎంజాయ్ చేసొచ్చారని విమర్శించారు. విజయవాడ సత్యనారాయణపురంలో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతోందని వ్యాఖ్యానించారు.

"ఇక 8 పనిదినాలు మాత్రమే మిగిలున్నాయి... రమ్యని అంతం చేసినవాడికి ఉరేసి మహిళలకు భరోసా ఇచ్చేది ఎప్పుడు? ఆడపిల్లలపై క్రూరజంతువుల్లా పడి వేధించేవారికి కఠినశిక్షలు పడేది ఎప్పుడు? ఈ రాష్ట్రంలో మహిళలకు జీవించే హక్కు లేదా?" అంటూ లోకేశ్ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News