Puri Jagannadh: ఈడీ కార్యాలయంలో ముగిసిన పూరీ జగన్నాథ్ పై విచారణ

ED concludes questioning Puri Jagannadh
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ అంశాలకు సంబంధించి ఈడీ అధికారులు ఈ ఉదయం నుంచి పూరీ జగన్నాథ్ ను విచారించారు. ఉదయం 10 గంటల తర్వాత మొదలైన విచారణ దాదాపు 10 గంటల పాటు సాగింది. పూరీ జగన్నాథ్ కు ఈడీ అధికారులు మధ్యలో ఓసారి భోజన విరామం ఇచ్చారు. పూరీ జగన్నాథ్ తో పాటు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీధర్ ను కూడా విచారించారు. ప్రధానంగా మనీలాండరింగ్ గురించే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Puri Jagannadh
ED
Drugs Case
Tollywood

More Telugu News