ఐదు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం పూరీ జగన్నాథ్ కు భోజన విరామం

ED questions Tollywood director Puri Jagannadh
  • టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం
  • విచారణ షురూ చేసిన ఈడీ
  • నేడు పూరీ జగన్నాథ్ పై విచారణ
  • ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన ఈడీ
టాలీవుడ్ లో కొన్నేళ్ల కిందట కలకలం రేపిన డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ ను నేడు ఈడీ విచారిస్తోంది. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి రాగా, ఏకబిగిన 5 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం భోజన విరామం ఇచ్చారు. తిరిగి ఈ సాయంత్రం 6 గంటల వరకు ఆయనను విచారించనున్నారు.

పూరీ జగన్నాథ్ నేటి విచారణకు తన చార్టర్డ్ అకౌంటెంట్ తో కలిసి విచ్చేశారు. గత ఆరేళ్ల కాలానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను ఆయన ఈడీ అధికారులకు అందజేశారు. 2015 నుంచి ఇప్పటివరకు జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు పూరీ జగన్నాథ్ ను పలు విధాల ప్రశ్నించారు. ముఖ్యంగా, విదేశీ లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Puri Jagannadh
Drugs Case
ED
Tollywood

More Telugu News