ఐదు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం పూరీ జగన్నాథ్ కు భోజన విరామం
- టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం
- విచారణ షురూ చేసిన ఈడీ
- నేడు పూరీ జగన్నాథ్ పై విచారణ
- ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన ఈడీ
పూరీ జగన్నాథ్ నేటి విచారణకు తన చార్టర్డ్ అకౌంటెంట్ తో కలిసి విచ్చేశారు. గత ఆరేళ్ల కాలానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను ఆయన ఈడీ అధికారులకు అందజేశారు. 2015 నుంచి ఇప్పటివరకు జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు పూరీ జగన్నాథ్ ను పలు విధాల ప్రశ్నించారు. ముఖ్యంగా, విదేశీ లావాదేవీలపైనా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.