తెలంగాణలో మరో 340 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 75,102 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 5,891 మందికి చికిత్స
అదే సమయంలో 359 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,47,953 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,891 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,872కి పెరిగింది.
