CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు

CM KCR Delhi tour finalized
  • మూడ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
  • సెప్టెంబరు 1న ఢిల్లీ పయనం
  • సెప్టెంబరు 2న టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి భూమిపూజ
  • సెప్టెంబరు 3న తిరిగి రాక
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1న బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం కానున్నారు. సెప్టెంబరు 2న దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ చేస్తారు.

హస్తినలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేంద్రం 1,300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సెప్టెంబరు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా పాల్గొంటారు. తిరిగి సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వస్తారు.
CM KCR
New Delhi
TRS Party Office
Telangana

More Telugu News