షూటింగు పార్టు పూర్తిచేసుకున్న 'లక్ష్య'
- విలువిద్య నేపథ్యంలో రూపొందిన 'లక్ష్య'
- కొత్తలుక్ తో కనిపించనున్న నాగశౌర్య
- కెరియర్ పరంగా ఇది తనకి 20వ సినిమా
- కథానాయికగా కేతిక శర్మ
ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేశామనీ, త్వరలో థియేటర్లకు తీసుకొచ్చే దిశగా పనులు మొదలయ్యాయని మేకర్స్ తెలియజేశారు. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.
విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. కెరియర్ పరంగా నాగశౌర్యకి ఇది 20వ సినిమా. ఈ సినిమాలో ఆయన సిక్స్ ప్యాక్ తో కూడిన కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో కేతిక శర్మ ఆయనతో జోడీ కడుతోంది. జగపతిబాబు .. సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.