Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases in AP decreased drastically
  • 24 గంటల్లో 878 కేసుల నమోదు
  • అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 2 కేసుల నిర్ధారణ
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,838
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 878 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 255 కేసులు నమోదు కాగా... అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,182 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 13 మంది మృతి చెందారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,13,001కి పెరగగా... 19,84,301 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,838 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

More Telugu News

Andhra Pradesh
Corona Virus
Updates