Vijay Sethupathi: వెంకీ చేతుల మీదుగా 'అనబెల్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్!

Annabelle Sethupathi trailer released
షార్ట్స్‌లో చూడండి
విజయ్ సేతుపతి - తాప్సీ నాయకా నాయికలుగా 'అనబెల్ సేతుపతి' సినిమా రూపొందింది. సుధన్ - జయరామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించాడు. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను వదిలారు.

వెంకటేశ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ ట్రైలర్ అసలు కథ ఏమిటనేది చెప్పేస్తోంది. 1948లో వీరసేతుపతి తనకి కాబోయే భార్య పట్ల గల ప్రేమతో ఒక అద్భుతమైన రాజమహల్ ను నిర్మిస్తాడు. ఆ రాజమహల్ ను సొంతం చేసుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో వైపున ఆ ఇంట్లో కొన్ని ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి.

ట్రైలర్ చూస్తుంటే హారర్ కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఖర్చు చేసినట్టుగా అనిపిస్తోంది. జగపతిబాబు .. రాజేంద్రప్రసాద్ .. రాధిక .. వెన్నెల కిషోర్ .. యోగిబాబు .. దేవదర్శిని ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, వచ్చేనెల 17వ తేదీ నుంచి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో  డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

Go Back to Shorts
Vijay Sethupathi
Taapsee
Jagapathi Babu
Radhika

More Telugu News