ఏపీహెచ్ బీ గృహ నిర్మాణ ప్రాజెక్టు కేసు చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలన్న సీఎం జగన్
- సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు
- డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- సీబీఐ తప్పుడు అభియోగాలు మోపిందని నివేదన
- ఇదే కేసులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన విజయసాయి
కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చార్జిషీటు నుంచి తన పేరు తొలగించాలని కోరారు. ఈ మేరకు డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.
ఇక, పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జి పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. ఈ నేపథ్యంలో, పెన్నా కేసులో తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 1కి వాయిదా వేసింది. పెన్నా చార్జిషీటుకు సంబంధించి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వీడీ రాజగోపాల్, శామ్యూల్ కూడా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు.