బిగ్ బీ అమితాబ్ పోలీస్ బాడీగార్డ్ వార్షికాదాయం రూ.కోటిన్నర.. బదిలీ చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్!
- అతడిపై విచారణ జరుపుతున్న అధికారులు
- సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నట్టు వెల్లడి
- అది తన భార్య పేరు మీద ఉందన్న గార్డ్
షిండే సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నట్టు, పలువురు ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థను తన భార్య నడుపుతోందని, దాంతో తనకు సంబంధం లేదని షిండే చెబుతున్నాడు. అమితాబ్ తనకు అదనంగా ఏమీ ఇవ్వట్లేదని తెలిపాడు.
మరోపక్క, ఇటు ఐదేళ్లకు మించి ఓ ప్రముఖుడి దగ్గర ఒకే బాడీగార్డ్ పనిచేయకూడదన్న నిబంధన ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, షిండే 2015 నుంచి అమితాబ్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు. అమితాబ్ కు ఎక్స్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనకు బాడీగార్డులుగా ఉంటున్నారు. అందులో షిండే అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమంటూ బిగ్ బీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.