Abhishek: చేతికి కట్టుతో సెట్స్ కి.. పెద్ద యాక్సిడెంట్ జరిగిందన్న అభిషేక్ బచ్చన్!

Abhishek handcuffed Actor who had a big accident
  • రాబోయే సినిమా షూటింగ్‌లో ప్రమాదం
  • శస్త్రచికిత్స కోసం ముంబై వెళ్లిన జూనియర్ బచ్చన్
  • చికిత్స అనంతరం మళ్లీ చెన్నైకి
బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్.. తన కొత్త సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యాడు. చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా ఆయన కుడిచేతికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్స కోసం ఆయన ముంబై వెళ్లాడు. తాజాగా చికిత్స పూర్తి చేసుకున్న ఆయన.. మళ్లీ చెన్నై బయలుదేరాడు. ఈ సందర్భంగా చేతికి పెద్ద కట్టుతో ఉన్న ఫొటోను జూనియర్ బచ్చన్ షేర్ చేశాడు.

‘‘కొత్త సినిమా సెట్స్‌లో బుధవారం పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కుడి చెయ్యి విరిగింది. దీనికి సర్జరీ అవసరమైంది. అందుకే ముంబైకి క్విక్ ట్రిప్ వేయాల్సి వచ్చింది. సర్జరీ పూర్తయింది. కట్లన్నీ కట్టేసుకుని పని మొదలు పెట్టడానికి మళ్లీ చెన్నై వచ్చేశా. షో ఆగకూడదు కదా! మా నాన్న అన్నట్లు ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ (మగవాడికి నొప్పి ఉండదు). ఓకే, ఓకే కొంచెం నొప్పిగా ఉంది. మీ విషెస్‌కు త్వరగా కోలుకోవాలన్న మెసేజిలకు ధన్యవాదాలు’’ అని అభిషేక్ ఒక పోస్టు పెట్టాడు. కెరీర్ పరంగా చివరగా అనురాగ్ బసు దర్శకత్వంలో లూడో సినిమాలో, ఆ తర్వాత హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’ చిత్రాల్లో అభిషేక్ కనిపించాడు. ప్రస్తుతం క్రైం థ్రిల్లర్ ‘బాబ్ బిస్వాస్’, కామెడీ డ్రామా ‘దస్వీ’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
Abhishek
Bollywood
Accident

More Telugu News