Somu Veerraju: రాష్ట్రం మళ్లీ కోలుకోలేనంతగా అప్పుల ఊబిలోకి వెళ్లింది: సోము వీర్రాజు

Somu Veerraju slams AP Govt
  • ఏపీ సర్కారుపై సోము ధ్వజం
  • రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం, వనరులున్నాయని వెల్లడి
  • అయినా అప్పులు పెరిగాయని విమర్శలు
  • అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి స్పందించారు. ఏపీ మళ్లీ కోలుకోలేనంతగా అప్పుల ఊబిలోకి వెళ్లిందని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ తీరప్రాంతం, ఆర్థిక వనరులు ఉన్నా గానీ అప్పులు పెరిగాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ సర్కారును డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతోందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు.
Somu Veerraju
AP Govt
YSRCP
Debts
BJP
Andhra Pradesh

More Telugu News