ఏపీలో కొత్తగా 1,539 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 243 కేసులు
- కర్నూలు జిల్లాలో 15 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 12 మరణాలు
- ఇంకా 14,448 మందికి చికిత్స
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1,140 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,07,730 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,79,504 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,448 మంది చికిత్స పొందుతున్నారు.