పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తృణమూల్ ఎంపీ నస్రత్​ జహాన్

Nusrat Jahan Gives birth to baby boy
  • ఇటీవలే భర్తతో విడిపోయిన నస్రత్   
  • భాగీరథి నియోతియా ఆసుపత్రిలో చేరిక  
  • ఈ ఉదయం ప్రసవం.. తల్లీ బిడ్డలు క్షేమం
ఇటీవలే భర్తతో విడిపోయి తీవ్రమైన ఆవేదనలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నస్రత్ జహాన్.. ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇవాళ ఆమె తన తొలి కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

నిన్న రాత్రి కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్ ఏరియాలో ఉన్న భాగీరథీ నియోతియా ఆసుపత్రిలో నస్రత్ ను జాయిన్ చేశారు. బెంగాలీ నటుడు యష్ దాస్ గుప్తా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే ఆసుపత్రిలో కొన్నాళ్లుగా ఆమె చెకప్ లు చేయించుకుంటున్నారు. ఈ వారం చివర్లో ఆమెకు ప్రసవం జరిగే అవకాశముందని డాక్టర్లు నిన్న చెప్పారు. అయితే, తెల్లవారగానే ఆమెకు ప్రసవం జరిగింది. డెలివరీ సమయంలో యష్ దాస్ గుప్తా ఆమె చెంతనే ఉన్నారు. ఆమెకు నటి, ఎంపీ మీమీ చక్రవర్తి సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

భర్త నిఖిల్ జైన్ తో నస్రత్ జూన్ 9న విడాకులు తీసుకుంది. అందుకు ఏడు కారణాలను ఆమె వివరించింది. వారిద్దరూ 2019 జూన్ 19న టర్కీలో వివాహం చేసుకున్నారు. ఆస్తిపాస్తుల విషయంలో తనను భర్త చిత్రహింసలు పెట్టాడంటూ నస్రత్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Nusrat Jahan
West Bengal
Kolkata
Trinamool Congress

More Telugu News