Ram Gopal Varma: ఆ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను.. శ్రీదేవి పాత్రకు ఆమె పేరే పెట్టాను: రామ్ గోపాల్ వర్మ

Fell in love when I was doing engineering says Ram Gopal Varma
  • ఇంజినీరింగ్ చదివేటప్పుడు సత్య అనే అమ్మాయిని ప్రేమించాను
  • నాది వన్ సైడ్ ప్రేమ
  • ఆ కథతోనే 'రంగీలా' సినిమా తీశాను
విద్యార్థి దశలో తాను ఒక అమ్మాయిని ప్రేమించానని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆమె పేరు సత్య అని తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో తాను ఆమె ప్రేమలో పడ్డానని చెప్పారు. ఆ రోజుల్లో ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పక్కపక్కనే ఉండేవని తెలిపారు.

 ఆమె మెడికల్ స్టూడెంట్ అని.... ఆమెతో తన వన్ సైడ్ లవ్ మొదలైందని చెప్పారు. అయితే డబ్బున్న వేరే కుర్రాడి కారణంగా తన ప్రేమను ఆమె పట్టించుకోదని తాను భావించానని తెలిపారు. తాను సినీ దర్శకుడిగా మారిన తర్వాత అదే కథతో 'రంగీలా' సినిమాను తెరకెక్కించానని చెప్పారు. సత్య మీద ఉన్న ప్రేమతోనే తాను తెరకెక్కించిన ఒక సినిమాకు 'సత్య' అని పేరుపెట్టుకున్నానని తెలిపారు. అంతేకాదు 'క్షణక్షణం' సినిమాలో శ్రీదేవి పోషించిన పాత్రకు కూడా 'సత్య' అనే పేరే పెట్టానని చెప్పారు.
Ram Gopal Varma
First Love
Tollywood
One Side Love

More Telugu News