Andhra Pradesh: వివేకా మాజీ డ్రైవర్​ ను విచారించిన సీబీఐ

CBI Inquiry Into Viveka Murder Case Continues for 81st day
  • ఇవాళ మేజిస్ట్రేట్ ముందుకు దస్తగిరి
  • వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం
  • ఇప్పటికే వాచ్ మన్ వాంగ్మూలం నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో 81వ రోజు పలువురిని సీబీఐ విచారించింది. ఆ విచారణకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యాడు. అతడి నుంచి పలు కీలక విషయాలను సీబీఐ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది.

అతడిని ఇవాళ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ సెక్షన్ 164 కింద దస్తగరి వాంగ్మూలాన్ని  నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వివేకా ఇంటి వాచ్ మన్ గా పనిచేసిన రంగయ్య వాంగ్మూలాన్ని అధికారులు మేజిస్ట్రేట్ వద్ద నమోదు చేయించారు.
Andhra Pradesh
YSRCP
YS Vivekananda Reddy

More Telugu News