Sonu Sood: సోనూసూద్ కోసం 69 ఏళ్ల జగ్గంపేట వృద్ధుడి సాహసం.. స్కూటీపై 1450 కిలోమీటర్ల ప్రయాణం!

Jaggampet man went mumbai to meet sonu sood on scooty
  • సోనూను కలిసేందుకు జగ్గంపేట నుంచి స్కూటీపై ముంబైకి
  • ఐదు రోజుల ప్రయాణం తర్వాత సోనూను కలిసిన వృద్ధుడు
  • స్కూటీపై వచ్చినందుకు నటుడు నొచ్చుకున్నారన్న సోమరాజు
  • సోనూ సూద్ సూచనపై ముంబై నుంచి రైలులో ఇంటికి
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు బొండా సోమరాజు సాహసం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌ను కలిసేందుకు స్కూటీపై ఏకంగా 1450 కిలోమీటర్లు ప్రయాణించారు. సోసూ సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సోమరాజు ఎలాగైనా ఆయనను కలవాలన్న ఉద్దేశంతో స్కూటీపై ముంబై బయలుదేరారు.

ఇంట్లో తెలిస్తే వెళ్లనివ్వరని భావించిన ఆయన పనిపై బయటకు వెళ్తున్నానని చెప్పి ఈ నెల 15న ఇంటి నుంచి స్కూటీపై ముంబై బయలుదేరారు. ప్రతి రోజూ 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఐదు రోజుల తర్వాత ఈ నెల 20న ముంబైలోని సోనూ సూద్ నివాసానికి చేరుకుని సోనూను కలిశారు.

ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ.. సోనూ సూద్ తనపై ఎంతో ప్రేమానురాగాలు చూపించారని అన్నారు. స్కూటీపై ఇంత దూరం ప్రయాణం చేసినందుకు నొచ్చుకున్నారని, ఏదైనా చెప్పాలనుకుంటే సామాజిక మాధ్యమాల ద్వారా చెబితే సరిపోతుందని అన్నారని సోమరాజు పేర్కొన్నారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారని చెప్పారు. సోనూ సూచన మేరకు అక్కడ తన స్కూటీని పార్శిల్ చేసి రైలులో బయలుదేరి ఈ నెల 24న ఇంటికి చేరుకున్నట్టు సోమరాజు వివరించారు.
Sonu Sood
East Godavari District
Jaggampet

More Telugu News