కడప జిల్లాలో సెంచరీ ప్లైబోర్డ్స్ కొత్త ప్లాంట్... సీఎంను కలిసిన సంస్థ ప్రతినిధులు
- బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్ పరిశ్రమ
- సీఎం జగన్ కు వివరాలు తెలిపిన సంస్థ వర్గాలు
- 2024 నాటికి ప్లాంట్ పూర్తి
- దాదాపు 9 వేలమందికి ఉపాధి
ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని సెంచరీ ప్లైబోర్డ్స్ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా 3 వేల మందికి ప్రత్యక్ష, 6 వేల మందికి పరోక్ష ఉపాధి కలుగుతుందని తెలిపారు. రైతులతో యూకలిప్టస్ తోటల సాగును ప్రోత్సహించి, వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు చేయూతగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా, బద్వేలులో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ ప్లాంట్ 2024 డిసెంబరు నాటికి పూర్తికానుంది.