జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వాయిదా
- తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామన్న సీబీఐ కోర్టు
- జగన్, విజయసాయి ఇద్దరి పిటిషన్లపై ఒకేరోజున తీర్పు
- బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన రఘురాజు
ఇక జగన్ పై పిటిషన్ విషయంలో ఈ రోజు తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించిన కోర్టు... తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని నేడు పేర్కొంది. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సంగతి తెలిసిందే.