Telangana: వెలిగొండ పనులు నిలుపుదల చేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ

  • కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ
  • ఏపీ ప్రాజెక్టులపై మరోసారి అభ్యంతరాలు
  • వెలిగొండ ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపణ
  • బచావత్ ట్రైబ్యునల్ ప్రస్తావన
Telangana govt wrote KRMB Chairman over Veligonda project

తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టులపై మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలుపుదల చేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపించారు. తాగునీటికి వాడే జలాలు 20 శాతమే లెక్కించాలని బచావత్ ట్రైబ్యునల్ చెబుతోందని, ఆ ప్రకారమే లెక్కించాలని పేర్కొన్నారు.

కాగా ఈ నెల 27న కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రావాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు బోర్డు సమాచారం అందించింది. ఈ భేటీలో 14 అంశాలు చర్చించాలని అజెండా నిర్ణయించారు. కానీ, అదే రోజున నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ ఉండడంతో తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ సమావేశానికి హాజరయ్యేది సందేహంగా మారింది.

More Telugu News