Nara Lokesh: ఇంకా దిశ చట్టం అంటూ మాయ చేయాలని చూస్తున్నారు: నారా లోకేశ్ ధ్వజం

Nara Lokesh questions CM Jagan on Ramya murder
  • రమ్య హత్యపై మరోసారి స్పందించిన లోకేశ్
  • ఇటీవల 21 రోజుల డెడ్ లైన్ విధించిన వైనం
  • ఇంకా 13 రోజులే మిగిలున్నాయని వెల్లడి
  • రమ్య హంతకుడ్ని ఎప్పుడు ఉరితీస్తున్నారంటూ ట్వీట్
గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో న్యాయం చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రతిరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంలో ఇంతకుముందే ప్రభుత్వానికి 21 రోజుల డెడ్ లైన్ విధించిన లోకేశ్... ఇంకా 13 రోజులే మిగిలున్నాయని స్పష్టం చేశారు.

"7 రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో కోర్టు విచారణ, 21 రోజుల్లో ఏకంగా ఉరిశిక్ష విధించేలా దిశ చట్టం రూపొందించామంటూ జగన్ పాలాభిషేకాలు చేయించుకున్నారు. కానీ ఆ చట్టం ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదని కేంద్రం తేల్చిచెప్పింది. దాంతో ఇది కూడా ఫేక్ సీఎం ఇస్తున్న ఫేక్ జీవోల మాదిరే ఫేక్ చట్టం అని అందరికీ తెలిసిపోయింది. అయినప్పటికీ ఇంకా దిశ చట్టం అంటూ మాయ చేయాలని చూస్తున్నారు. దిశ చట్టం తెచ్చామని సొంత మీడియాలో రూ.30 కోట్లతో ప్రచారం చేసుకున్న తర్వాత వందల మంది ఆడబిడ్డలు బలయ్యారు. ఇక 13 రోజులే మిగిలున్నాయి. రమ్యను బలితీసుకున్న ఉన్మాదిని ఎప్పుడు ఉరితీయబోతున్నారు?" అంటూ లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
Nara Lokesh
CM Jagan
Ramya
Murder
Guntur
Andhra Pradesh

More Telugu News