Karthikeya: 'ఆర్ఎక్స్100' హీరో కార్తికేయ నిశ్చితార్థం

RX 100 fame Karthikeya got engaged
  • ఇటీవలే జరిగిన నిశ్చితార్థం
  • అమెరికా నుంచి వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు పొందిన హీరో కార్తికేయ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇటీవలే ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అతి తక్కువ మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

వీరి నిశ్చితార్థం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న కార్తికేయ అక్కడి నుంచి వచ్చిన వెంటనే నిశ్చితార్థంపై అధికారిక ప్రకటన చేయనున్నాడని తెలుస్తోంది.

పెళ్లికూతురుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పెళ్లికూతురుది హైదరాబాద్ అని తెలుస్తోంది. ప్రస్తుతం కార్తికేయ తెలుగులో 'రాజా విక్రమార్క', తమిళంలో అజిత్ సినిమా 'వలిమై'లో నటిస్తున్నాడు. అజిత్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు.
Karthikeya
Tollywood
Engagement

More Telugu News