CM Jagan: రోడ్డు ప్రమాదంలో పోలీసులు మృతి చెందడం పట్ల సీఎం జగన్ సంతాపం

CM Jagan condolences four police personnel died in a road mishap
  • శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • నుజ్జునుజ్జయిన బొలెరో వాహనం
  • నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలవడం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బంది మృతి పట్ల ఆయన సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆర్మీ జవాను అంత్యక్రియలకు ఎస్కార్ట్ గా వెళ్లి వస్తున్న పోలీసుల వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏఆర్ పోలీసులు మృత్యువాతపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.
CM Jagan
Police
Road Accident
Death
Andhra Pradesh

More Telugu News