శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒళ్లు గగుర్పొడుస్తున్న ప్రమాద దృశ్యాలు
- నిర్లక్ష్యంగా రోడ్డు దాటేందుకు యత్నం
- వేగంగా వచ్చి ఢీకొట్టిన మరో బైక్
- అల్లంత దూరం ఎగిరిపడిన వైనం
అదే సమయంలో బైక్ పై అత్యంత వేగంగా వస్తున్న మరో వ్యక్తి నియంత్రించుకునే సమయం లేక ఆ బైక్‌ను ఢీకొట్టాడు. ఆ వేగానికి బైక్‌లు నుజ్జు నుజ్జు కాగా, ముగ్గురూ ఎగిరి పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.