Afghanistan: దేశం విడిచి పారిపోయిన ఆఫ్ఘన్ పాప్‌స్టార్ ఆర్యన

Afghan pop star Aryana flees from country
  • రెండు భయంకరమైన రాత్రుల తర్వాత క్షేమంగా, సజీవంగా ఉన్నా
  • షాక్ నుంచి తేరుకున్నాక చాలా విషయాలు చెబుతా
  • విమానంలో ఉన్న ఫొటోలను షేర్ చేసిన ఆర్యన
తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజల మానప్రాణాలకు రక్షణ కరవైన వేళ దేశం నుంచి వెళ్లిపోయేందుకు ప్రముఖులు సైతం ప్రయత్నిస్తున్నారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాలిబన్ల కంట పడకుండా దేశం దాటుతున్నారు.

మరీ ముఖ్యంగా మహిళల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. షరియా చట్టాల ప్రకారం మాత్రమే మహిళలకు హక్కులు ఉంటాయన్న తాలిబన్ల ప్రకటన వారిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు, కళా రంగాల్లోని మహిళలు, మిలటరీ ఉద్యోగాలు చేస్తున్న వారికి ముప్పు తప్పదన్న విషయం అర్థమైంది.

ఈ క్రమంలో తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రముఖ పాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఆర్యన సయీద్ కూడా దేశం నుంచి తప్పించుకుంది. కాబూల్‌ను విడిచి పారిపోయిన ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. అమెరికా కార్గో జెట్ విమానంలో దేశాన్ని విడిచిన ఆర్యన.. విమానంలో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

రెండు భయంకరమైన రాత్రుల అనంతరం తాను క్షేమంగా, సజీవంగా ఉన్నానని అందులో రాసుకొచ్చింది. దోహా చేరుకున్నానని, ఇస్తాంబుల్ వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. ఇంటికి చేరుకుని షాక్ నుంచి తేరుకున్నాక మీతో పంచుకునేందుకు చాలా విషయాలున్నాయని ఆ పోస్టులో రాసుకొచ్చింది. కాగా, సినీ నిర్మాత అయిన హసీబ్ సయ్యద్‌ను ఆర్యన వివాహం చేసుకుంది.
Afghanistan
Pop Star
Aryana Sayeed
Kabul

More Telugu News