ఏపీలో మరో 1,435 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 69,173 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 199 కేసులు
- కర్నూలు జిల్లాలో 19 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 6 కరోనా మరణాలు
- ఇంకా 15,472 మందికి చికిత్స
అదే సమయంలో 1,695 మంది కోలుకోగా, రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,702కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,00,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,70,864 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,472 మంది చికిత్స పొందుతున్నారు.