Alla Ramakrishna Reddy: చంద్రబాబు చదివిన స్కూల్ ను కూడా జగన్ బాగు చేయిస్తున్నారు: ఎమ్మెల్యే ఆర్కే

Jagan renovating Chandrababu studied school also says Alla Ramakrishna Reddy
  • అంబేద్కర్ బాటలోనే జగన్ నడుస్తున్నారు
  • పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధానమని భావిస్తున్నారు
  • పాఠశాలల దుస్థితికి చంద్రబాబే కారణం
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాటలోనే ముఖ్యమంత్రి జగన్ నడుస్తున్నారని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొనియాడారు. పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధానమని జగన్ భావిస్తున్నారని... అందుకే రాష్ట్రంలోని పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. తన మంగళగిరి నియోజకవర్గంలో పాఠశాలలు బాగోలేవని వార్తలు రాస్తున్నారని... ప్రభుత్వం దశలవారీగా పాఠశాలలను అభివృద్ది చేస్తున్న సంగతి వార్తలు రాస్తున్న వారికి తెలియదా? అని ప్రశ్నించారు. పాఠశాలల దుస్థితికి చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబు ఏరోజైనా కారు దిగి స్కూళ్లని పరిశీలించారా? అని  ప్రశ్నించారు.

స్కూల్స్ ను బాగు చేస్తున్న విషయంలో ప్రజలంతా జగన్ ను అభినందిస్తున్నారని ఆర్కే అన్నారు. చంద్రబాబు చదువుకున్న స్కూల్ కూడా దారుణంగా ఉందని తమ ఎమ్మెల్యే చెప్పారని... ఆ స్కూల్ ని కూడా జగన్ బాగు చేయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి విషయాలు పత్రికలకు కనిపించవా? అని విమర్శించారు. సూళ్ల అభివృద్ధి కార్యక్రమాల తొలి దశ పనులు పూర్తయ్యాయని... రెండో దశ పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.
Alla Ramakrishna Reddy
ysr
Jagan
Chandrababu
telugu
Ambedkar

More Telugu News