షూటింగు పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'

Raja Vikramarka shooting completed
  • కార్తికేయ 'హీరోగా రాజా విక్రమార్క'
  • కథానాయికగా తాన్య రవిచంద్రన్ 
  • జోరుగా పోస్టు ప్రొడక్షన్ పనులు 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు     
కార్తికేయ కథానాయకుడిగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో 'రాజా విక్రమార్క' సినిమా రూపొందుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ సినిమాను నిర్మిస్తున్న రామారెడ్డి తాజాగా ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుకొచ్చారు.

"సినిమా పరిశ్రమలో నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నేను ఈ సినిమాను నిర్మించాను. నిర్మాతగా నేను చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు కార్తికేయ అయితే బాగుంటాడని ఆయనను సంప్రదించడం జరిగింది. ఈ సినిమాలో ఆయన ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా కనిపిస్తాడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫంక్షన్ కి చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాము. ఇక పై మా బ్యానర్లో వరుస సినిమాలు ఉంటాయి. నిర్మాణపరమైన విషయాల్లో రామానాయుడుగారే మాకు ఆదర్శం" అని చెప్పుకొచ్చారు నిర్మాత.
Go Back to Shorts
Karthikeya
Tanya Ravichandran
Sri Saripalli

More Telugu News