Udayanidhi: మంచి చేయకపోతే మాత్రం కేంద్రాన్ని గతంలో కంటే ఎక్కువగా నిలదీస్తాం: ఉదయనిధి స్టాలిన్

We dont have issues with centre says Udayanidhi
  • కేంద్ర ప్రభుత్వంతో మాకు భేదాభిప్రాయాలు లేవు
  • రాష్ట్రానికి మంచి చేస్తే కేంద్రాన్ని అభినందిస్తాం
  • దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వమే కారణం
కేంద్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి అన్నారు. తమిళనాడుకు మంచి చేస్తే కేంద్రాన్ని అభినందిస్తామని... మంచి చేయకపోతే మాత్రం గతంలో కంటే ఎక్కువగా నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 15,475 కోట్ల జీఎస్టీ బకాయిలను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఉదయనిధి ఆరోపించారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యల గురించి చెప్పకుండా... చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ అశాస్త్రీయ కార్యక్రమాలకు పిలుపునిచ్చారని విమర్శించారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ఇటుకలు తరలించారని... ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని ఉదయనిధి దుయ్యబట్టారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.  
Udayanidhi
Stalin
Tamil Nadu
DMK
Centre

More Telugu News