రమ్య ఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది: నారా లోకేశ్

  • ఇటీవల సంచలనం సృష్టించిన రమ్య హత్య
  • రాజుపాలెంలో తాజాగా మరో ఘటన
  • దళిత బాలికపై అత్యాచారం జరిగిందన్న లోకేశ్
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఇటీవల సంచలనం సృష్టించిన రమ్య ఘటన మరువక ముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుందని నారా లోకేశ్ వెల్లడించారు. రాజుపాలెంలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిపారు. ఇది బాధాకరమైన ఘటన అని, రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని లోకేశ్ విమర్శించారు.

విపక్ష నాయకులను తిట్టడం, కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయి ఉండేవి కావని వ్యాఖ్యానించారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Nara Lokesh
CM Jagan
Ramya Murder
Rajupalem Incident
Guntur District

More Telugu News