Mynampally: బండి సంజయ్‌ ఏఎస్ రావునగర్ రహస్యాలు బయటపెడతా: మైనంపల్లి

Will expose Bandi Sanjays secrets says Mynampally
  • దళితులపై దాడి చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారు
  • నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
  • బండి సంజయ్ రాసలీలల గుట్టు విప్పుతా
త్వరలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బండారాన్ని బయటపెడతానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. దళితులపై దాడి చేసినట్టు తనపై తప్పుడు కేసులు పెట్టారని... దాడి జరిగిన సమయంలో తాను ఇంట్లోనే లేనని చెప్పారు. తాను ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోనని చెప్పారు. బండి సంజయ్ తో ఎలాంటి చర్చకైనా సిద్ధమని అన్నారు. సంజయ్ ని పదవి నుంచి దింపేంత వరకు నిద్రపోనని చెప్పారు. బండి సంజయ్ ఏఎస్ రావు నగర్ రహస్యాలను బయటపెడతానని... రాసలీలల గుట్టు విప్పుతానని అన్నారు.
Mynampally
TRS
Bandi Sanjay
BJP

More Telugu News