Parthasarathy: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్ట్

Hyderabad police arrests Karvy Stock Broking MD Parthasarathy
  • ఇండస్ ఇండ్ బ్యాంకు ఫిర్యాదు
  • రూ.137 కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు
  • సీసీఎస్ పోలీసుల అదుపులో పార్థసారథి
  • నాంపల్లి కోర్టులో హాజరు
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం ఎగవేత కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి కార్వీ సంస్థ రూ.137 కోట్ల మేర రుణం తీసుకుంది. అయితే నిర్దేశిత గడువు లోపు కార్వీ రుణం తిరిగి చెల్లించలేదంటూ ఇండస్ ఇండ్ బ్యాంకు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పార్థసారథిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Parthasarathy
Arrest
CCS Police
Karvy
IndusInd Bank
Hyderabad

More Telugu News