ఏడున్నరేళ్ల నరకానికి ముగింపు: శశిథరూర్
- సునంద ఆత్మహత్య కేసు తీర్పుపై కాంగ్రెస్ ఎంపీ స్పందన
- తీర్పుతో కారు చీకట్లు తొలగిపోయాయి
- సునంద ఆత్మ ఇప్పుడే శాంతిస్తుంది
- ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచింది
‘‘నా భార్య సునంద మరణం తర్వాత ఎంతో కాలం నా చుట్టూ అలముకున్న కారు చీకట్లు ఈ తీర్పుతో తొలగిపోయాయి. ఆమె మరణంపై నా మీద ఎన్నెన్నో నిరాధారపూరితమైన ఆరోపణలను మోపారు. మీడియా ఎన్నో అభాండాలను వేసింది. అయితే, ఇప్పుడు వచ్చిన తీర్పు న్యాయవ్యవస్థపై నా నమ్మకాన్ని మరింత పెంచింది. తప్పు చేస్తే మన న్యాయవ్యవస్థ కచ్చితంగా శిక్షిస్తుంది. ఏదిఏమైనా న్యాయం జరిగింది’’ అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.