'ఆహా'లో 'SR కల్యాణ మండపం'
- ఈ నెల 6న థియేటర్లకు వచ్చిన సినిమా
- కిరణ్ అబ్బవరం జోడీగా ప్రియాంక జవాల్కర్
- కీలకమైన పాత్రలో సాయి కుమార్
- త్వరలోనే 'ఆహా' ద్వారా స్ట్రీమింగ్
ఆ వారంలో విడుదలైన సినిమాల్లో ఇదే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. అయితే అదే ఊపును మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తుందనే దర్శక నిర్మాతల అంచనాలు తప్పాయి. కొద్దిపాటి లాభాలతో సినిమా ఓకే అనిపించుకుందట. ఆ సినిమాను ఇప్పుడు ఓటీటీ ద్వారా వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా ఓటీటీ హక్కులు 'ఆహా' వారు తీసుకున్నారట. సాధ్యమైనంత త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నారని అంటున్నారు. 'ఆహా' నుంచి స్ట్రీమింగ్ డేట్ రానున్నట్టుగా చెబుతున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమా 'ఆహా' ద్వారా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.