Varla Ramaiah: పంచ్ ప్రభాకర్ పై మన రాష్ట్రంలోనూ చర్యలు ఉంటాయా డీజీపీ గారూ?: వర్ల రామయ్య

Varla Ramaiah questions AP DGP on Punch Prabhakar issue
  • అనుచిత పోస్టుల పర్యవసానం
  • ఢిల్లీలో పంచ్ ప్రభాకర్ పై కేసు
  • పంచ్ ప్రభాకర్ ను ఢిల్లీకి రప్పిస్తున్నారన్న వర్ల
  • అతడిపై ఏపీలోనూ కేసులున్నాయని వెల్లడి
కేంద్రం పెద్దలపైనా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపైనా అనుచిత పోస్టులు పెట్టాడంటూ వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీలో కేసు నమోదవడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

వైసీపీ విదేశీ విభాగం సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని, పెద్దలపై అసభ్య పోస్టులు పెట్టినందుకు అతడిని ఢిల్లీకి రప్పిస్తున్నారని వివరించారు. మరి, మన రాష్ట్రంలోనూ టీడీపీ నేతలు, జడ్జిలపై పంచ్ ప్రభాకర్ అసభ్య పోస్టులు పెట్టాడంటూ ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు. మరి అతనిపై చర్యలు ఉంటాయా డీజీపీ గారూ? అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు.
Varla Ramaiah
Punch Prabhakar
Police Case
AP DGP
YSRCP
Andhra Pradesh

More Telugu News