Facebook: తాలి'బ్యాన్'... తీవ్రవాదులుగా పేర్కొంటూ నిషేధం విధించిన ఫేస్ బుక్

  • ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
  • ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో నిషేధం
  • తాలిబన్ అనుకూల కంటెంట్ పైనా నిషేధం
  • నిపుణుల బృందం ఏర్పాటు
Facebook bans Talibans on its social media platforms

యమదూతల్లాంటి తాలిబన్ల పాలన అంటేనే ఆఫ్ఘన్లు హడలిపోతున్నారు. ఛాందసవాదానికి సిసలైన ప్రతిరూపాలుగా నిలిచే తాలిబన్లను సోషల్ మీడియాలో కొనసాగించరాదని ప్రముఖ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ భావిస్తోంది. తాలిబన్లను తీవ్రవాదులుగా పేర్కొంటూ ఫేస్ బుక్ తాజాగా నిషేధం విధించింది. తమ ఇతర వేదికలైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లను కూడా వినియోగించకుండా ఫేస్ బుక్ నిషేధాజ్ఞలు ప్రకటించింది.

అంతేకాదు, తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్ పైనా ఫేస్ బుక్ కొరడా ఝళిపించింది. తమ సోషల్ మీడియా సైట్లలో తాలిబన్ల అనుకూల కంటెంట్ ను తొలగించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.

More Telugu News