నీరజ్ కు చూర్మా.. సింధుకు ఐస్ క్రీం: ఒలింపిక్స్ బృందంతో ప్రధాని ఆత్మీయ సమావేశం.. ఇవిగో ఫొటోలు
- తన నివాసంలో ఒలింపిక్స్ బృందానికి బ్రేక్ ఫాస్ట్
- ప్రతిఒక్కరితోనూ ప్రత్యేకంగా మాటామంతీ
- పేరుపేరునా అభినందనలు చెప్పిన ప్రధాని

ఒలింపిక్స్ కు వెళ్లిన భారత బృందంతో ప్రధాని ఆత్మీయ సమావేశముంటుందని గత వారమే ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్య దినోత్సవం కోసం ఎర్రకోటకు వారందరినీ ఆహ్వానించారు. ఇక నేటి ఉదయం ప్రధాని ఢిల్లీలోని తన నివాసంలో వారిని బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు. ఈ క్రమంలో ముందు చెప్పినట్టుగానే సింధుకు ఐస్ క్రీం, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు చూర్మాను ఆయన తినిపించారు. ప్రతి ఒక్క క్రీడాకారుడిని ఆయన అభినందించారు.
