Sharmila: తెలంగాణ‌లో 'శ్రీ' పేరిట లక్షల ఎకరాల భూములు.. వాటిని మింగేసేందుకు కుట్ర‌: వైఎస్ ష‌ర్మిల‌

sharmila slams kcr
  • ఓన‌ర్‌షిప్ విష‌యంలో క్లారిటీలేని 3 ల‌క్ష‌ల ఎక‌రాల భూములు
  • 'శ్రీ' అనే పేరిట రిజ‌స్ట‌ర్ అయి ఉన్నాయి
  • కొట్టేసేందుకే ధరణిని తీసుకొచ్చారు
  • పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే య‌త్నం
తెలంగాణ‌లో ఓన‌ర్‌షిప్ విష‌యంలో క్లారిటీలేని 3 ల‌క్ష‌ల ఎక‌రాల భూములు శ్రీ అనే పేరిట ఉన్నాయ‌ని ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేస్తూ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.  
 
ఎవ‌రి పేరుమీదా రిజిస్టర్ కాని 'శ్రీ' పేరిట ఉన్న లక్షల ఎకరాలను మింగేందుకే ధరణిని తీసుకొచ్చార‌ని ష‌ర్మిల ఆరోపించారు.  పేదల భూములను లాక్కొని దొరలకు కట్టబెట్టేందుకే సీఎం కేసీఆర్ ధరణి ఏర్పాటు చేశారు తప్ప భూరికార్డుల ప్రక్షాళనకోసం కాదని ఆమె విమర్శించారు.

'భూములు ఉన్నోళ్లకు లేనట్టు.. లేనోళ్లకు ఉన్నట్టు.. తప్పుల తడకగా తయారైంది ధరణి. దానికి తోడు అధికార్ల చేతివాటంతో బతికున్నోళ్లను చంపేసి ఇతరులకు పట్టాలు కట్టబెడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో నా భూమిని నాకు ఇప్పించండని .. నా పేరున పట్టా చేయాలని ఏండ్ల తరబడి తిరిగి చివరకు ఎమ్మార్వో ఆఫీసుకు తాళిబొట్టు కట్టింది ఓ మహిళ. ఇది దొరగారు తెచ్చిపెట్టిన ధరణి కష్టాలు' అంటూ ష‌ర్మిల మండిపడ్డారు.
Sharmila
YSRCP
Telangana

More Telugu News