నకిలీ చలానాల కుంభకోణం.. సమగ్ర దర్యాప్తుకు జగన్ ఆదేశం
- ఏపీలో కలకలం రేపుతున్న నకిలీ చలానాల కుంభకోణం
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో జగన్ సమావేశం
- సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ఆదేశం
మరోవైపు ఈ అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన చర్చించారు. సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సమాధానంగా ఇప్పటికే రూ. 40 లక్షలు రికవరీ చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.