సీఎం గారూ... డాక్టర్ సునీతకు పెద్ద మనసుతో భద్రత కల్పించండి: వర్ల రామయ్య
- రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన సునీత
- అనుమానిత వ్యక్తుల సంచారంపై ఆందోళన
- ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
"మీ బాబాయి వివేకా హత్యకేసులో ఫిర్యాదు చేసిన డాక్టర్ సునీత తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు పెద్దమనసుతో ఆమెకు రక్షణ కల్పించండి" అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.