Lord's Test: లార్డ్స్ టెస్టులో అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఆట

Play in Lords test has begun
  • భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్
  • నేటి నుంచి లార్డ్స్ లో రెండో టెస్టు
  • టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్
  • 16 ఓవర్లలో 38 పరుగులు చేసిన భారత్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నేడు లార్డ్స్ లో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జో రూట్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ షురూ చేసింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి వర్షం ఆటంకం కలిగించింది. దాంతో అరగంట ఆలస్యంగా ఆట మొదలైంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 29, కేఎల్ రాహుల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇక్కడి తేమ పరిస్థితులను తమ పేసర్లు సద్వినియోగం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో, టీమిండియా ఓపెనర్లు ఇంగ్లండ్ సీమర్లను ఆచితూచి ఎదుర్కొంటున్నారు.
Lord's Test
India
England
Rain

More Telugu News