Nirmala Sitharaman: రేషన్ డిపో వద్ద కనిపించని ప్రధాని ఫొటో.. కేంద్ర మంత్రి నిర్మల ఆగ్రహం

Union Minister Nirmala fire on ration dealer for not putting Modi photo
  • సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే అమరనాథ్
  • రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఇప్పుడెందుకన్న మంత్రి
  • 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయిందన్న మంత్రి  

విశాఖపట్టణం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేటలో ఉన్న రేషన్ డిపోను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని గుర్తించిన ఆమె రేషన్ డీలర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద కేంద్రం బియ్యాన్ని ఉచితంగా అందిస్తోందని, అలాంటప్పుడు రేషన్ షాపు వద్ద ప్రధాని ఫొటో లేకుండా బియ్యం ఎలా పంపిణీ చేస్తారని డీలర్‌ను ప్రశ్నించారు.

వాహనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇంటికే బియ్యం సరఫరా చేస్తోందని జేసీ వేణుగోపాల్‌రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్ నిర్మలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సంగతి ఇప్పుడెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే,  విశాఖపట్టణంలోని చినవాల్తేరులో పట్టణ ఆరోగ్య కేంద్రంలో కేంద్రమంత్రి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. టీకా ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తోందన్నారు.  

  • Loading...

More Telugu News