Telangana: సొంత కుమార్తెపై లైంగిక చర్యకు భాగస్వామిని ప్రేరేపించిన మహిళ.. హేయమైన చర్యగా పేర్కొని బెయిలు నిరాకరించిన హైకోర్టు

Telangana HC Denies Bail to a woman who allows To Commit Sexual Assault on her own daughter
  • భర్త చనిపోవడంతో వివాహేతర సంబంధం
  • మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి ప్రోత్సహించిన మహిళ
  • అతడి ద్వారా బాలుడికి జన్మనిచ్చిన బాలిక
  • ఆ తర్వాత కూడా రెండుసార్లు గర్భం
తన సొంత కుమార్తెపై లైంగిక చర్య జరిపేందుకు భాగస్వామిని ప్రోత్సహించిన కేసులో నిందితురాలైన మహిళకు బెయిలు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తనను బెయిలుపై విడుదల చేయాలంటూ నిందితురాలు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జి.శ్రీదేవి సారథ్యంలోని ధర్మాసనం ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. ఆమెపై నమోదైన అభియోగాలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

నిందితురాలైన మహిళ తన భర్త మరణానంతరం మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి లివిన్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగస్వామికి ఆమె మైనర్ కుమార్తెపై కన్ను పడగా, చిన్నారిపై లైంగిక చర్యకు మహిళ అతడికి అనుమతి ఇచ్చింది. దీంతో అతడు ఆమెపై తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ క్రమంలో గర్భవతి అయిన బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది.

ఆ తర్వాత కూడా బాలిక రెండుసార్లు గర్భం ధరించగా పిల్స్ ఇవ్వడంతో అబార్షన్ అయింది. బాలిక జన్మనిచ్చిన బాలుడికి మహిళ భాగస్వామే బయోలాజికల్ తండ్రి అని డీఎన్ఏ రిపోర్టులో తేలింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు పిటిషనర్‌పై నమోదైన అభియోగాలను తీవ్రమైనవిగా, హేయమైన స్వభావం కలిగినవిగా గుర్తించి నిందితురాలికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె పెట్టుకున్న బెయిలు దరఖాస్తును కొట్టేసిన కోర్టు కేసు విచారణను ఆరు నెలల్లోపు ముగించాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana
TS High Court
Woman
Bail

More Telugu News