johnson and johnson: దేశంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి జాన్సన్​ అండ్​ జాన్సన్ సింగిల్ డోసు​ టీకాకు అనుమతులు

johnson and johnson vaccine gets nod says Union Health Minister Mansukh Mandaviya
  • కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్ర‌క‌ట‌న‌
  • దేశం తన వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సామర్థ్యాన్ని పెంచుకుందని వ్యాఖ్య‌
  • భారత్ లో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ట్వీట్
క‌రోనా ప్ర‌భావంతో అల్లాడిపోతోన్న భార‌త్‌లో మ‌రో టీకా వినియోగంలోకి రానుంది. అమెరికాకు చెందిన‌ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్‌ డోసు టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో తెలిపారు.

ఇప్పుడు దేశం తన వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సామర్థ్యాన్ని పెంచుకుందని ఆయ‌న పేర్కొన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చామ‌ని తెలిపారు. ప్రస్తుతం భారత్ లో ఐదు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, క‌రోనాపై దేశ పోరాటాన్ని ఈ వ్యాక్సిన్లు మరింత ముందుకు తీసుకెళతాయ‌ని ఆయన అన్నారు.
johnson and johnson
vaccine
Corona Virus

More Telugu News