Divi: 'బంగార్రాజు' దర్శకుడి నుంచి 'దివి'కి పిలుపు!

Divi in kalyan krishna new movie
  • బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్
  • ముఖ్యమైన పాత్రలవైపు మొగ్గు
  • నిర్మాతగా కల్యాణ్ కృష్ణ
  • దర్శకుడిగా నవీన్ గాంధీ
'దివి' పేరును యూత్ కి ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. కొంతకాలం క్రితం వరకూ చిన్నచిన్న పాత్రలను చేస్తూ వచ్చిన ఆమె, బిగ్ బాస్ హౌస్ కి వచ్చి వెళ్లిన దగ్గర నుంచి క్రేజ్ పెరిగిపోయింది. కాస్త ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వెళుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 అలాంటి 'దివి'కి 'బంగార్రాజు' దర్శకుడు కల్యాణ్ కృష్ణ నుంచి పిలుపు వెళ్లినట్టుగా చెబుతున్నారు. అయితే 'బంగార్రాజు' సినిమా కోసం కాదు. ఆయన నిర్మాతగా చేస్తున్న మరో సినిమా కోసం. కల్యాణ్ కృష్ణ తన స్నేహితులతో కలిసి నిర్మాతగా మారాడట. ఓటీటీ కోసం సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

అలా ఆయన ఓటీటీ కోసం ఒక కొత్త కాన్సెప్ట్ ను రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ఆయన స్నేహితుడైన నవీన్ గాంధీ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. లీడ్ రోల్ కోసమే 'దివి'ని ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారట.
Divi
kalyan krishna
Naveen Gandhi

More Telugu News