Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ప్ర‌క‌టించిన‌ వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డును తిర‌స్క‌రించిన తెలకపల్లి రవి

Telakapalli Ravi Rejects YSR Lifetime achievement award
  • ప్రస్తుతం వివాదాస్పద రాజకీయ మీడియా, సామాజిక మాధ్య‌మాలు ఉన్నాయి
  • ఈ వాతావరణంలో ఈ అవార్డును స్వీకరించడం లేదు
  • పురస్కారం ప్ర‌క‌టించినందుకు కృతజ్ఞతలు  
సీనియర్ జ‌ర్న‌లిస్టు తెలకపల్లి రవికి ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ అవార్డును తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెల‌క‌ప‌ల్లి ర‌వి తెలియజేశారు. ఈ అవార్డులను ఇటీవ‌ల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రోజే మరో సీనియర్ జ‌ర్న‌లిస్టు పాలగుమ్మి సాయినాథ్ కూడా ఈ అవార్డును తిరస్కరించారు. ఇప్పుడు తెలకపల్లి రవి కూడా తిర‌స్క‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలోనూ స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న వివాదాస్పద రాజకీయ మీడియా, సామాజిక మాధ్య‌మాల వాతావరణంలో ఈ అవార్డును స్వీకరిండం లేదని ఆయన  తెలిపారు. అయితే, ఈ పురస్కారం త‌న‌కు ప్రకటించి, త‌న ప‌ట్ల‌ గౌరవాదరణ క‌న‌బ‌ర్చిన ఏపీ ప్రభుత్వం, ఎంపిక కమిటీకి, అభినందనలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.

కాగా, ఇటీవల ఏపీ ప్ర‌భుత్వం వివిధ రంగాలకు చెందిన సంస్థలు, ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, కళాకారులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, అచీవ్‌మెంట్‌ పురస్కారాలను ప్రకటించింది. 31 మంది లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌, 32 మంది అచీవ్‌మెంట్ పుర‌స్కారాల‌కు ఎంపిక‌య్యారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్ కింద రూ.10 లక్షలు, అచీవ్‌మెంట్ కింద రూ.5 లక్షలు, జ్ఞాపిక అందజేసి ఆగస్టు 14న లేక‌ 15న‌ సత్కరిస్తారు.
Andhra Pradesh
award

More Telugu News