India: టోక్యో ఒలింపిక్స్ హాకీ.. కాంస్య పతక పోరులో భారత అమ్మాయిల పరాజయం

indian womens hockey team losses in bronze medal match
  • తొలుత ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత జట్టు
  • చివర్లో డిఫెన్స్ పట్టుతప్పడంతో ఓటమి
  • భారత అభిమానులకు నిరాశ
టోక్యో ఒలింపిక్స్‌ హాకీ కాంస్య పతక పోరులో భారత అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. గ్రేట్ బ్రిటన్‌తో కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓడిపోయారు. ఫలితంగా హాకీలో భారత్‌కు మరో పతకం వస్తుందని ఎదురుచూసిన అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. నిజానికి రెండో క్వార్టర్‌లో భారత జట్టే ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరల్లో డిఫెన్స్‌పై పట్టుతప్పడంతో బ్రిటన్ వరుస గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ చివరి వరకు పోరాడిన భారతజట్టు త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది.
India
Tokyo Olympics
Hockey team

More Telugu News